ప్రభుత్వంతో చర్చలు విఫలం.. నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు
- ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతల చర్చలు
- నాలుగు వారాల సమయం కోరిన ప్రభుత్వ కమిటీ
- తమ డిమాండ్లు పాతవేనని స్పష్టం చేసిన జేఏసీ
- నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించిన జేఏసీ
తెలంగాణ ప్రభుత్వంతో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీనితో ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు.
ఈ క్రమంలో డిమాండ్లపై ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇవ్వాలని జేఏసీ నేతలను కమిటీ కోరింది. అప్పటి వరకు సమ్మెను విరమించుకోవాలని కోరింది. అయితే ఐఏఎస్ అధికారుల కమిటీ విజ్ఞప్తిని జేఏసీ నాయకులు అంగీకరించలేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
చర్చల అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, తమ సమస్యలను ఐఏఎస్ అధికారుల కమిటీకి వివరించామని తెలిపారు. వారు నాలుగు వారాల గడువు కోరారని, కానీ తమ డిమాండ్లు కొత్తవి కావని వెల్లడించారు. గతంలో ఇచ్చిన హామీలనే తాము అడుగుతున్నామని అన్నారు. తమ మాట విని నాలుగు వారాలు ఆగాలని కమిటీ కరాఖండిగా చెప్పిందని, దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో తాము సమ్మెకు వెళుతున్నామని తెలియజేశారు. 32 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తాము సమ్మెను కొనసాగిస్తామని వెల్లడించారు.